Header Banner

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

  Fri Mar 07, 2025 12:36        Politics

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ప్రసంగం ఆరోహణ, అవరోహణతో ఓ మంచి సినిమా చూస్తున్నామనే భావన కల్పించిందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. వ్యవసాయ, దేవాదాయ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై చర్చకు మంత్రులు సమాధానం ఇచ్చిన అనంతరం వారి ప్రసంగాలను ప్రశంసించారు. 'దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam Ramanarayana Reddy) ఆద్యంతం ఆధ్యాత్మికతతో చాగంటిని గుర్తుతెచ్చేలా, సమకాలీన రాజకీయాన్ని జోడించడంలో గరికపాటి వారిని జ్ఞప్తికి తీసుకొచ్చేలా చాలా అద్భుతంగా మాట్లాడారు. దేవాదాయ శాఖకు నిధులేమీ లేవని చాలా సున్నితంగా చెప్పారు' అని కొనియాడారు. 'దేవాలయానికి భక్తులు మనశ్శాంతి కోసం వస్తారు. స్థలాలున్న దేవాలయాల్లో ధ్యాన మందిరాలు నిర్మిస్తే భక్తులు భగవంతుణ్ని ప్రశాంతంగా ధ్యానించుకోవడానికి అవకాశం ఉంటుంది. మా చిన్నతనంలో ఆలయాలకు వెళ్తే హరికథల రూపంలో రామాయణం, మహాభారతం చెప్పేవారు. ఇప్పుడు ఆ కళాకారులకు ప్రోత్సాహం కరవైంది. వారిలో ఓ వెయ్యి మందికి ప్రదర్శనలకు అవకాశం ఇస్తే భృతి కల్పించినట్లు ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

సమాజంలో భగవంతుడిపై అవగాహన కల్పించినట్లూ ఉంటుంది. దీనిపై ఆలోచించాలి' అని స్పీకర్ సూచించారు. జగన్ పేరు ప్రస్తావించకుండా మంత్రి రామనారాయణరెడ్డి మాట్లాడటంపై 'మన పురాణాల్లో రాక్షసులు ఉంటేనే దేవతలకు విశిష్టత వచ్చింది. అసురులు ఉంటేనే దేవతలకు ప్రఖ్యాతి' అని వ్యాఖ్యానించారు. ఎంతసేపు మాట్లాడాం అనేది కాదని, బుల్లెట్ దిగిందా? లేదా? అన్నట్లు ప్రసంగం ఉండాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. శాసనసభలో గురువారం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఎక్కువ సమయం ప్రసంగించడంతో రఘురామ పైవిధంగా స్పందించారు. మనం మాట్లాడేటప్పుడు ఎంతమంది వింటున్నారు.. అనేది చూడాలని, ఎవరి గొడవలో వారు ఉంటే ప్రయోజనం ఏమిటని అన్నారు. కొంతమంది కుర్రాళ్లు పుట్టుకతో వృద్ధులు అని శ్రీశ్రీ అన్నారని, కానీ కొందరు వృద్ధులు ఎప్పటికీ కుర్రాళ్లే అని రఘురామ వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరిలకు... మాట్లాడే అవకాశం ఇస్తూ వారిని కుర్రాళ్లంటూ సంబోధించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

 

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RRR #AndhraPradesh #APpolitics #YCP #Jagan #AtchannaiduSpeech